మొదటిసారి UPI బయోమెట్రిక్ ప్రామాణీకరణను ప్రారంభించిన అమేజాన్ పే
UPI బయోమెట్రిక్ ప్రామాణీకరణ ప్రారంభం అనేజి ఈ కొత్త ఫీచర్ ను పరిచయం చేయడానికి భారతదేశంలో మొదటి చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ లో ఒకటిగా మారుతోందని అమేజాన్ పే ఈరోజు ప్రకటించింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
UPI బయోమెట్రిక్ ప్రామాణీకరణ ప్రారంభం అనేజి ఈ కొత్త ఫీచర్ ను పరిచయం చేయడానికి భారతదేశంలో మొదటి చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ లో ఒకటిగా మారుతోందని అమేజాన్ పే ఈరోజు ప్రకటించింది. PIN నమోదు చేయవలసిన లేదా గుర్తు చేయవలసిన అవసరం లేకుండా ఫేస్ స్కాన్ లేదా ఫింగర్ ప్రింట్ ను ఉపయోగించి కస్టమర్లు ఇప్పుడు లావాదేవీలను ఆమోదించవచ్చు. మీరు స్నేహితుడికి డబ్బు పంపిస్తున్నా, స్టోర్ లో చెల్లిస్తున్నా, అమేజాన్ పే UPIని ఉపయోగిస్తూ మీ బ్యాలెన్స్ ను తనిఖీ చేయవచ్చు, మీ ఫింగర్ ప్రింట్ లేదా ముఖం మీ యొక్క సురక్షితమైన కీగా మారుతుంది.
రూ. 5,000 వరకు లావాదేవీల కోసం UPI PINను నమోదు చేసే అవసరాన్ని కొత్త బయోమెట్రిక్ ప్రామాణీకరణ సామర్థ్యం నిర్మూలిస్తుంది. ప్రారంభపు స్వీకరణ సూచికలు ఈ అనుభవం కోసం కస్టమర్ల యొక్క బలమైన ప్రాధాన్యతను చూపిస్తున్నాయి, 90% కస్టమర్లు అర్హులైన పీర్-టు-పీర్ UPI లావాదేవీల కోసం బయోమెట్రిక్స్ ను ఎంచుకుంటున్నారు. ఈ ఆవిష్కరణ ఘర్షణలను గణనీయంగా తగ్గించి, చెల్లింపులను వేగంగా, మరింత సహజంగా, మరియు సురక్షితంగా చేసింది ఎందుకంటే బయోమెట్రిక్ ప్రామాణీకరణ కస్టమర్ డివైజ్ కు పరిమితం కానీ భాగస్వామ్యం చేయదగినది కాదు.
కీలకమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలు :
· ఒక-చేయి వినియోగం వేగవంతమైన లావాదేవీలకు వీలు కల్పిస్తుంది
· బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా మెరుగైన భద్రత
· రూ. 5,000 వరకు లావాదేవీల కోసం PIN-రహితమైన ప్రామాణీకరణ
· సెండ్ మనీ, స్కాన్ & పే, మరియు మర్చంట్ పేమెంట్ లలో నిరంతరంగా సమీకృతమవడం
గిరీష్ కృష్ణన్, పేమెంట్స్ డైరెక్టర్, అమేజాన్ ఇండియా ఇలా అన్నారు, “డిజిటల్ చెల్లింపులు ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా చేయడమే మా లక్ష్యం. UPI బయోమెట్రిక్ ప్రామాణీకరణతో, రోజూవారీ చెల్లింపుల నుండి మేము మరొక సమస్యను తొలగిస్తున్నాము మరియు వాటిని 2 రెట్లు వేగవంతం చేస్తున్నాము. ఫీడ్ బ్యాక్ ఇప్పటి వరకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది, ముఖ్యంగా ఈ అనుభవం ఎంతో సహజంగా మరియు వేగవంతంగా ఉందని అభిప్రాయం వెల్లడైంది మరియు ఇది భారతదేశం డిజిటల్ గా చెల్లింపులు చేసే విధానంలో స్థాయిలను నిరంతరంగా పెంచడానికి ఇది మమ్మల్ని ప్రోత్సహిస్తుంది.”
ఈ ప్రారంభోత్సవం UPI చెల్లింపులను సురక్షితంగా, వేగంగా మరియు కస్టమర్లు నేడు తమ డివైజ్ లతో ఏ విధంగా పరస్పర చర్యలు జరుపుతున్నారని విషయంతో మరింత అనుసంధానం చేసే దిశగా గణనీయమైన చర్యను సూచిస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం లభిస్తోంది మరియు భారతదేశపు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఆవిష్కరణ నాయకునిగా అమేజాన్ పే యొక్క స్థానాన్ని పునః శక్తివంతం చేసింది.