కేరళలోని పతనంతిట్ట జిల్లాలో బాప్టిజమ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 100 మందిపైగా అస్వస్థతకు గురయ్యారు. బాప్టిజం వేడుకకు హాజరైన 100 మంది వ్యక్తులు గత వారం డిసెంబర్ 29 గురువారం ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడ్డారు. క్యాటరింగ్ సర్వీస్ కంపెనీపై పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆహార నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.
గత వారం పతనంతిట్ట జిల్లా కీజ్‌వాయిపూర్ గ్రామంలో బాప్టిజం వేడుక జరగగా, దానికి చాలా మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన 100 మందికి పైగా ఫుడ్ పాయిజన్‌తో బాధపడి ఆ ప్రాంతంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. ఈవెంట్ నిర్వహించిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీజ్‌వాయిపూర్ పోలీసులు క్యాటరింగ్ సర్వీస్ కంపెనీపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 268, 272, 269 కింద కేసు నమోదు చేశారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కూడా సోమవారం 100 మందికి ఫుడ్ పాయిజనింగ్‌కు గురైనట్లు నివేదికలు వెలువడటంతో విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం తదుపరి విచారణలు జరుగుతున్నాయి.