ఆగిన క్రికెట‌ర్ పెళ్లి.. ఎందుకంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2020 7:50 AM GMT
ఆగిన క్రికెట‌ర్ పెళ్లి.. ఎందుకంటే..?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి కారంణంగా ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో మృత్యువాత ప‌డ‌గా.. ల‌క్ష‌ల్లో దీని బాధితులు ఉన్నారు. ఈ వైర‌స్ క‌ట్ట‌డి కోసం చాలా దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. దీంతో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. తాజాగా ద‌క్షిణాప్రికా కూడా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ను ప్ర‌క‌టించింది. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ఓ క్రికెట‌ర్ పెళ్లి ఆగిపోయింది.

ద‌క్షిణాఫ్రికా మ‌హిళా క్రికెట‌ర్ లిజెల్లీ వివాహాం ఏప్రిల్ 10న ఆమె ప్రియుడు తాంజా క్రోనేతో జ‌ర‌గాల్సి ఉంది. ద‌క్షిణాఫ్రికాలో లాక్‌డౌన్ ఆ రోజుకి 15రోజుగా ఉండ‌డంతో ఆమె వివాహం నిలిచిపోయింది. ఈ ఓపెన‌ర్ ప్ర‌స్తుతాం త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద ఎర్మెలాలో నివ‌సిస్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమితం అయ్యింది. ఒక‌వేళ క‌రోనా ముప్పు లేకుంటే.. ద‌క్షిణాఫ్రికా ఈ పాటికి ఆస్ట్రేలియాతో మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడేది. కాగా లిజెల్లీ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టు మంచి స్థితిలో ఉంద‌ని, ఎలాంటి జ‌ట్టుకు భ‌య‌ప‌డేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ జ‌ట్టుతో ఆడాల‌ని ఉంద‌ని, అలాంటి జ‌ట్టుతో త‌మ‌కు ఆడాల‌ని ఉంద‌ని, అలాంటి జ‌ట్టుని ఓడించి త‌మ స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి చాటాల‌నుకుంటున్న‌ట్లు తెలిపింది.

Next Story
Share it