బీసీసీఐ పీఠమెక్కిన బెంగాల్‌ టైగర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 6:54 AM GMT
బీసీసీఐ పీఠమెక్కిన బెంగాల్‌ టైగర్‌

ముంబై: భారత క్రికెట్‌ నియంత్ర మండలి కొత్త అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. గత గురువారం జరిగిన బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదివికి దాదా మినహా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయని విషయం తెలిసిందే. బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ పగ్గాలు చేపట్టారు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేయబోతున్న రెండో వ్యక్తిగా దాదా రికార్డు సృష్టించాడు. గంగూలీకి ముందు 1954-56 మధ్య కాలంలో పూసపాటి విజయానంద గజపతి రాజు బీసీసీఐ బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

గత 33 నెలల పాటు బీసీసీఐని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతలు నిర్వహించింది. గంగూలీతో పాటు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా కూమారుడు జైషా బీసీసీఐ కార్యదర్శిగా, అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ సింగ్‌ ధూమల్‌ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో సునీల్‌ గావాస్కర్‌, శివలాల్‌ యాదవ్‌ బీసీసీఐ అధ్యక్షత బాధ్యతలు నిర్వర్తించారు. అయితే బీసీసీఐ పగ్గాలు చేపట్టిన దాదా మరో 10 నెలలు మాత్రమే పదవిలో ఉంటారు. ఐదేళ్లకు పైగా బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా గంగూలీ పని చేశారు. అయితే లోధా కమిటీ నిబంధన ప్రకారం గంగూలీ మూడేళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి.



Next Story