దక్షిణాదిలో 'హిందీ'దుమారం
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 18 Sept 2019 4:30 PM IST

హిందీ భాషా దినొత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన 'ఒకే దేశం - ఒకే భాష ' వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక సీఎం యడ్యూరప్ప అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్టాలిన్ కూడా మరో ద్రవిడ ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. తాజాగా దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ దీనిపై స్పందించారు.
"దక్షిణాది ప్రజలు ప్రత్యేకించి తమిళనాడు లో ప్రజలు హిందీ ని అంగీకరించరని, ఉత్తరాదిలో కూడా ఒకే భాషా విధానం చెల్లదని, కాబట్టి, ఒకే భాషను బలవంతంగా రుద్దడం సాధ్యం కాదు" అన్నారు రజనికాంత్ .
ఏ భాషైనా దేశం మొత్తం మీద అమలయ్యేలా చేయడం సరికాదనీ, బలవంతంగా అమలు చేస్తే, ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని రజనికాంత్ అభిప్రాయపడ్డారు.
Next Story