ప్రపంచానికి ద్వారాలు తెరిచిన సౌదీ..!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 27 Sept 2019 4:03 PM IST

రియాద్: తాము తలుపులు మూసుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేమని సౌదీ తన నిర్ణయంతో ప్రపంచ దేశాలకు సంకేతాలు పంపింది. ఓ చారిత్రక నిర్ణయాన్ని సౌదీ ప్రభుత్వం తీసుకుంది. తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించాలని సౌదీ భావిస్తుంది. దీంతో పర్యాటక వీసాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సౌదీ ప్రభుత్వం. విజన్ 2030లో ఇది తొలి అడుగు అని సౌదీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
యితే..సౌదీ ఆయిల్ పరిశ్రమల మీద దాడులు జరిగిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారా? అంతకు ముందే నిర్ణయం తీసుకుని ఇప్పుడు ప్రకటించారా అనేది స్పష్టంగా తెలియదు. అయితే..తమ ఆర్ధిక వ్యవస్థకు బూమ్ ఇవ్వడానికి సౌదీ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు. టూరిస్ట్ వీసాల కోసం 49 దేశాల వారు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది
Next Story