మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన రియల్‌ హీరో సోనూసూద్‌

By సుభాష్  Published on  13 Oct 2020 11:28 AM GMT
మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన రియల్‌ హీరో సోనూసూద్‌

సోనూసూద్‌.. ఈ పేరు వింటేనే హీరోనే కాకుండా మానవత్వం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు సోనూసూద్‌ దేశ వ్యాప్తంగా దేవుడయ్యాడు. కరోనా విపత్కర సమయంలో లాక్‌డౌన్‌లో ఎంతో మంది పేదలకు ఆదుకుని రియల్‌ హీరో అనుపించుకున్నాడు. నిరుపేదలతో పాటు విద్యార్థుల వరకు అందరికి అండగా నిలుస్తూ సాయం అందించి శభాష్‌ అనిపించుకుంటున్నాడు. సాయానికి మరో పేరంటూ అది సోనూసూదేనని చెప్పాలి. కోవిడ్‌ సమయంలో వలస కార్మికులకు, విద్యార్థులకు, నిరుపేదలకు చేసిన సాయం వెలకట్టలేనిది. ఎవరైన కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారంటే చాలు వారికి 'నేనున్నాను' అంటూ ముందుకొస్తాడు. రీల్‌ విలన్‌ నుంచి యావత్‌ భారతదేశానికి రియల్‌ హీరోగా మారిపోయాడు. అయితే తాజాగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారు సోనూసూద్‌.

ఈ రోజు ఆయన తల్లి సరోజ్‌ సూద్‌ వర్థంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా ఐఏఎస్‌ అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లు అందివ్వనున్నట్లు ప్రకటించారు. తన తల్లి సరజ్‌ సూద్‌ పేరు మీద పేదరికంలో ఉండి ఐఏఎస్‌కు సిద్దం అవుతున్న అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయం చేస్తానని పేర్కొన్నారు. స్కాలర్‌ షిప్‌ల కోసం www.schoollifyme.com సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సోనూసూద్‌ సూచించారు.Next Story