హర్యానా: టిక్ టాక్ వీడియోలు జనాలని నాశనం చేస్తున్నాయని కొందరంటున్నారు. మరికొందరు మాత్రం టిక్ టాక్ వీడియోలతో స్టార్స్ అవుతున్నారు. తమ టాలెంట్ తో లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు. అంతేకాదు..తాజాగా ఓ టిక్ టాక్ స్టార్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్ నే ఇచ్చేసింది.

Image result for sonali phogat tik tok star

Image result for sonali phogat tik tok star

సోనాలి ఫోగాట్ అనే మహిళ బాలీవుడ్ పాటలకు లిప్ సింక్ చేస్తూ  పాటలు పాడి టిక్ టాక్ లో పెడుతుంది. సామాజిక మాధ్యమాల్లో అవి ట్రెండ్ అయ్యాయి. కొన్ని రోజుల్లోనే ఆమెకు లక్షల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. దీంతో ఆమె హర్యానా – రాజస్థాన్ బోర్డర్ లోని ఆదంపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ పొందింది. బిష్ణోయ్ కుటుంబ సభ్యుల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో గెలుపు బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టిక్ టాక్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న సోనాలి ఫోగాట్ ను వ్యూహాత్మకంగా బరిలో నిలిపింది.

Image result for sonali phogat tik tok star

Image result for sonali phogat tik tok star

కొన్ని టివి సీరియల్స్ లో నటించిన సోనాలి టిక్ టాక్ లో వీడియోలు తో చాలా ఫేమస్ అయ్యారు. అయితే ..ఈమె బిజెపి జాతీయ మహిళా మోర్చా కి సోనాలి వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. చండీగఢ్, హర్యానా రాష్ట్రాల షెడ్యూల్డ్ తెగల విభాగానికి ఇంచార్జి గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.టిక్ టాక్ తో ఆదంపూర్ లో ప్రత్యర్దుల టాప్ లేపేస్తానంటోంది సోనాలి.

Image result for sonali phogat tik tok star

Image result for sonali phogat tik tok star

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.