ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..న్యూజిలాండ్ లో ఎంపీ..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2019 1:55 PM ISTన్యూజిలాండ్: ఆమెకు విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే చాలా ఆసక్తి. విదేశాల్లో ఉన్నత చదువులు చదివింది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడు న్యూజిలాండ్‌లో ఎంపీగా ఉన్నారు. ఆమె ఎవరో కాదు..న్యూజిలాండ్ మొట్టమొదటి దక్షిణ భారత ఎంపీ ప్రియాంకా రాదాకృష్ణన్. చెన్నైలో పుట్టిన ప్రియాంక రాధాకృష్ణన్.. తన తండ్రి ఉద్యోగరీత్యా చిన్నతనమంతా సింగపూర్‌లో ఉండాల్సి వచ్చింది. వెల్లింగ్టన్‌లోని విక్టోరియా యూనివర్పిటీ నుంచి డెవలప్‌మెంట్‌లో మాస్టర్ పూర్తి చేసిన ప్రియాంకా రాధాకృష్ణకు 2010లో వివాహం అయ్యింది.
చదువు కోసం న్యూజిలాండ్‌కు వచ్చిన ప్రియాంకా రాధాకృష్ణన్.. మస్సే యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ తరఫున ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆఫీసర్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఆమె మొదటిసారిగా రాజకీయాలవైపు అడుగులు వేశారు. ఎథ్నిక్ కమ్యూనిటీల గళం వినిపించాలనుకున్నా ప్రియాంక.. న్యూజిలాండ్ లేబర్ పార్టీ సిద్ధంతాలు నచ్చడంతో 2006లో ఆ పార్టీలో చేరిన ప్రియాంక రాధకృష్ణన్.. ఆ పార్టీని బలోపేతం చేయడంతో తనవంతు కృషి చేశారు. దీంతో ఆమె పని తీరును గుర్తించిన లేబర్ పార్టీ నాయకత్వం ప్రియాంకా రాధాకృష్ణన్ 2017 సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్‌కు నామినేట్ చేసింది. ఇప్పుడు ఆ పార్టీ తరఫున పార్లమెంటేరియన్‌గా ప్రియాంకా రాధాకృష్ణన్ ఉన్నారు.
కాగా ఇటీవల ఆంక్లాండ్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ప్రియాంకా రాధాకృష్ణన్ సిరిసిల్ల చీర కట్టుకొని బతుకమ్మ ఆడాదరు. సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ తయూరు చేసిన చీరను చూసి ఆమె ఎంతో ముచ్చటపడ్డారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ప్రియాంకరాధాకృష్ణన్ ఆడిపాడారు. తెలంగాణ బ్రాండ్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.