నిజ నిర్ధారణ : ఆ రైతు నిజంగానే అమ‌రావ‌తి కోసం ప్రాణ‌త్యాగం చేశాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jan 2020 5:20 PM GMT
నిజ నిర్ధారణ : ఆ రైతు నిజంగానే అమ‌రావ‌తి కోసం ప్రాణ‌త్యాగం చేశాడా..?

డిసెంబర్ 17 న, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఫార్ములా ను వాడాలని అనుకున్నట్టు ప్రకటించారు. లెజిస్లేటివ్ కాపిటల్ గా అమరావతి, ఎక్సిక్యుటివ్ కాపిటల్ గా విశాఖపట్నం, కర్నూల్ ని జుడిష్యరీ కాపిటల్ గా చేయాలని ఆయన ప్రదిపాదించారు.

ఈ ప్రదిపాదన తరువాత అమరావతి కోసం తమ భూములు కోల్పోయిన సుమారు 25 వేల మంది రైతులు నిరసనలకి పాల్పడ్డారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తూ రోడ్ల పైకి వచ్చి ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు.

ఈ గొడవల మధ్య, రాజధాని అమరావతి కోసం ప్రాణ త్యాగం చేసిన రైతు అంటూ ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. రాజధాని అమరావతి నుంచి మార్చవద్దంటూ రైతులు ఆందోళనలు చేపట్టినప్పుడు, పోలీసులు వారి పైన తప్పుడు కేసులు పెట్టారని, దానివలన తన పరువు పోయిందనీ ఆందోళన చెందుతూ ఒక రైతు ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కి ప్రాణ త్యాగానికి పాల్పడ్డాడంటూ ఈ వీడియో ప్రచారం జరుగుతోంది.

గత 24 గంటలుగా, ఈ వీడియో ఫేస్ బుక్ లో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. వాట్సాప్, ట్విట్టర్ లోనే కాకుండా యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయబడింది.

నిజ నిర్ధారణ:

ఈ వీడియోను జాగ్రత్తగా తరచి చూస్తే, ట్రాన్స్ ఫార్మర్ కింద ఉన్న బోర్డును నిశితంగా పరిశీలిస్తే, దాని మీద TANGEDCO అనే అక్షరాలు చూడవచ్చు. ఈ పదాలను గూగుల్ లో సేర్చ్ చేసి చుస్తే, అవి తమిళ నాడు రాష్ట్ర విద్యుత్ శాఖ కు సంబంధించినవని తెలుస్తోంది. Tamil Nadu Generation and Distribution Corporation ని TANGEDCO అని కూడా అంటారు. దీని వల్ల మనకు ఈ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగినది కాదు, తమిళ నాడు లో జరిగిందని తెలుస్తోంది.

http://www.tangedco.gov.in/

సంఘటన జరిగిన ఖచ్చితమైన ప్రాంతం కనుగొనడానికి గూగుల్ లో వీడియో నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్లను వాడి, ‘Man kills himself on Transformer’ అనే కీ వర్డ్ లతో కలిపి రివర్స్ ఇమేజ్ సేర్చ్ చేశాము. అప్పుడు, జనవరి 8వ తారీఖున తమిళ భాషలో ప్రచురించబడిన వివిధ రిపోర్టులు ఫలితాలలో వెలుబడ్డాయి.

https://tamil.webdunia.com/article/regional-tamil-news/military-man-commited-suicide-near-madurai-120010800021_1.html

గూగుల్ ట్రాన్స్ లేట్ సహాయంతో ఒక పత్రికలో వెలువడిన వార్తను తెర్జుమా చేస్తే, ఈ సంఘటన మధురై లో జరిగిందని, ఆత్మహత్య కు పాల్పడిన వ్యక్తి రైతు కాదు సైనికుడని తెలుస్తోంది.

సేర్చ్ ను కొద్దిగా మార్చి ‘Soldier tries to commit suicide in madhurai’ అనే పదాలను ఉపయోగించి సేర్చ్ చేసిన వెంటనే జనవరి 8, 2020 నాడు ప్రచురించబడిన కధనం లభించింది.

https://timesofindia.indiatimes.com/city/madurai/army-man-under-inquiry-attempts-suicide/articleshow/73146830.cms

ఈ కధనం ప్రకారం, ఆత్మ హత్యకు పాలపడిన వ్యక్తి మధురై కి చెందిన ముత్తు, జనవరి 7న, అతను ట్రాన్స్ ఫార్మర్ పైన ఉండే హై టెన్షన్ వైర్లను పట్టుకొని చనిపోయే ప్రయత్నం చేశాడు. అతని భార్య ధెనీషా కట్నం కోసం కుటుంబ వేధింపులకు గురి కావడం వల్ల ఆత్మ హత్య చేసుకుంది. దీనివల్ల, ఆర్డిఓ ఆఫీసులో విచారణకు ముత్తు ను పిలిచారు.

విచారణ తరువాత మనస్తాపానికి లోనైన ముత్తు నేరుగా ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కాడు. బంధువులు, స్నేహితులు వారిస్తున్నా వినకుండా ట్రాన్స్ ఫార్మర్ కి ఉన్న లైవ్ టర్మినల్ ను తాకి కింద పడిపోయాడు. అతనిని వెంటనే ఆసుపత్రి కి అధికారులు తరలించారు.

తమిళంలో ప్రచురించబడిన మరో కధనం

https://tamil.oneindia.com/news/madurai/soldier-suicide-attempt-near-madurai-collectorate/articlecontent-pf427396-373593.html

చివరగా, ఇది అమరావతి రాజధాని గా ఉండాలంటూ రైతు ఆత్మహత్య చేసుకునే వీడియో అంటూ జరుగుతున్న ప్రచారం తప్పు. ఇందులో ఆత్మహత్య కు పాల్పడిన వ్యక్తి తమిళ నాడులోని మధురై కి చెందిన ఒక సైనికుడు, కుటుంబ కలహాల కారణంగా అతను ఇలా చేశాడు.

Next Story