కశ్మీర్‌లో ముందుస్తు హిమపాతం
By న్యూస్‌మీటర్ తెలుగు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. పంజాబ్, హరియాణా వంటి పక్క రాష్ట్రాలలో పంట పొలాలు ఎక్కువగా తగులబెడుతున్నారు. దాని నుంచి వెలువడే దట్టమైన పొగల ప్రభావం ఢిల్లీ పై పడుతోంది. దీంతో ఢిల్లీలో కాలుష్య భూతం ప్రజలను కబళించేందుకు కోరలు చాస్తోంది. అయితే రానున్న రోజుల్లో వాయు కాలుష్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు.
కశ్మీర్‌లో ఇప్పటికే మంచు కురుస్తోంది. కశ్నీర్ హిమపాతం కారణంగా రాజధానిలోని స్వచ్ఛమైన గాలి శాతం ఘననీయంగా పడిపోయినట్లు వాతావరణశాఖ ప్రకటించింది. దీని ద్వారి గాలిలోని ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది. దీంతో ప్రజలకు స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. ప్రస్తుత పరిస్థితి ప్రజలకు ప్రాణాంతకంగా మారనుందని అధికారులు తెలిపారు.
హిమపాతం కారణంగా కశ్మీర్, లడక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఘననీయంగా పడిపోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో.. వాహనాలు పట్టు కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీనగర్, జమ్మూ, లెహ్ మనాలి రహదారి, మొఘల్ రహదారి వంటి మార్గాల్లో ఈ ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
మరోవైపు కశ్మీర్ లో ప్రారంభ హిమపాతానికి ఢిల్లీ వాతావరణంలో, గాలిలో కాలుష్య కారకాలు తగ్గుతాయి. దీంతో ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయిలపై ప్రభావం పడుతుందని "కాశ్మీర్ మెటారోలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సోనమ్ లోటస్ అన్నారు. అలాగే ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలకు కొంత ఉపశమనం పొందుతారని తెలిపారు.
�