మంచు తుఫాన్‌ అల్లకల్లోలం.. మృత్యువు ఓడికి 108 మంది

By అంజి  Published on  16 Jan 2020 2:59 AM GMT
మంచు తుఫాన్‌ అల్లకల్లోలం.. మృత్యువు ఓడికి 108 మంది

ముఖ్యాంశాలు

  • పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మంచు తుఫాన్‌ బీభత్సం
  • నీలం వ్యాలీలో విరిగిపడ్డ మంచుకొండ చరియలు
  • ఆఫ్ఘానిస్తాన్‌లో కూడా మంచు తుఫాన్‌

జమ్ముకశ్మీర్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే), అప్ఘానిస్తాన్‌, బెలూచిస్తాన్‌లో మంచు తుఫాన్‌ అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుఫాన్‌ బీభత్సనికి నీలం వ్యాలీలో మంచు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మంచు తుఫాన్‌ దాటికి ఇప్పటికే మొత్తంగా 108 మంది మృతి చెందారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది. పలువురు క్షతగాత్రులను సహాయ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కుప్వారా సెక్టార్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎల్‌ఓవసీ వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. తుఫాన్‌ ధాటికి ఎనిమిది మంది జవాన్లు కొట్టుకుపోయారు. దీంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో నలుగురిని సిబ్బంది రక్షించారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు.

ఆఫ్ఘానిస్తాన్‌ బార్డర్‌లో కూడా మంచు తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతి చెందగా, మరో 10 మందికి గాయాలు అయ్యాయి. బెలూచిస్తాన్‌లో కూడా మంచు తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. దీని ధాటికి 31 మంది చనిపోగా.. అందులో మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకి చేరాయి. క్వెట్టా నగరంలో ప్రజలు తమ పనులు చేసుకొవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. వీపరితంగా మంచు కురుస్తుండటంతో ప్రజలు కనీసం ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. షాహబ్‌ జాయ్‌, చమాన్‌ ప్రాంతాల్లో ఇంటిపై కప్పుపై భారీగా మంచు పేరుకుపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది చనిపోగా, మరో 8 మందికి గాయాలు అయ్యాయి. బెలూచిస్తాన్‌లో మంచు తుఫాన్‌ ధాటికి ప్రతి సంవత్సరం 700 మంది చనిపోతారని అక్కడి ప్రభుత్వం వివరించింది.

Next Story