ఫ్యామిలీ మెంబ‌ర్స్ స‌మ‌క్షంలో ఘ‌నంగా స్నేహ సీమంతం.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 1:48 PM GMT
ఫ్యామిలీ మెంబ‌ర్స్ స‌మ‌క్షంలో ఘ‌నంగా స్నేహ సీమంతం.!

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ చిత్రాల్లో న‌టించి ఫ్యామిలీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్ప‌రుచుకున్న క‌థానాయిక స్నేహ‌. 2012లో తమిళ యాక్టర్ ప్రసన్నని స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తరువాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్పెషల్ రోల్స్ లో కనిపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం పెద్ద కుమారుడు నిహ‌స్ కి జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు స్నేహ మరోసారి తల్లి కాబోతుంది.

ఈ సంద‌ర్భంగా ఆమె సీమంతం వేడుకను కుటుంబ సభ్యులు గ్రాండ్ గా నిర్వహించారు. ఇక కొన్నేళ్ల క్రితం పెద్ద కుమారుడు నిహస్ కి జన్మనిచ్చిన స్నేహ దంపతులు ఇప్పుడు మరో బిడ్డకు స్వాగతం పలుకబోతున్నారు. ఇక ఆమె సీమంతానికి సంబందించిన ఈవెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్న స్నేహాకు అభిమానులు విషెస్ అందిస్తున్నారు.

Next Story
Share it