బంగారం అక్రమ రవాణా.. ఒకరు సుత్తిలో.. ఇంకొకరు మిక్సీలో..

By అంజి  Published on  13 Feb 2020 3:21 AM GMT
బంగారం అక్రమ రవాణా.. ఒకరు సుత్తిలో.. ఇంకొకరు మిక్సీలో..

హైదరాబాద్‌: అక్రమంగా విదేశం నుంచి రవాణా చేస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌, ముంబై ఎయిర్‌పోర్టుల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నాడు దుబాయ్‌ను రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి ముంబై వచ్చిన ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద లభించిన సుత్తిలో 931 గ్రాముల బంగారాన్ని దాచాడు.

1 2

హైదరాబాద్‌లో దుబాయ్‌ నుంచి విమానంలో వచ్చిన ముగ్గురిని అధికారులు తనిఖీ చేయగా.. వారి వద్ద 931 గ్రాముల బంగారం పట్టుబడింది. మరో ఘటనలో విదేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరిని తనిఖీ చేశారు. మిక్సీ లోపల దాచిన 650 గ్రాముల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ మొత్తం బంగారం విలువు దాదాపుగా రూ. కోటి విలువ ఉంటుందని అధికారులు తేల్చారు. నిందితులను కస్టమ్స్‌ చట్టం అరెస్ట్‌ చేసిన అధికారులు విచారిస్తున్నారు.

5 7

Next Story