నాకు ఎలాంటి వ‌రుడు కావాలంటే..? : స్మృతి మంధాన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2020 10:33 AM GMT
నాకు ఎలాంటి వ‌రుడు కావాలంటే..? : స్మృతి మంధాన

క‌రోనా వైర‌స్‌(కొవిడ్-19) ప్ర‌పంచాన్నివ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే క్రీడా టోర్నీలు అన్ని వాయిదా ప‌డ్డాయి. దేశ వ్యాప్త లాక్‌డౌన్‌తో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో అప్పుడ‌ప్పుడూ కొద్ది మంది క్రీడాకారులు సోష‌ల్‌మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టిస్తున్నారు.

తాజాగా భార‌త స్టార్ మ‌హిళా క్రికెట‌ర‌ల్ స్మృతి మంధాన ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఓ అభిమాని మీ జీవిత భాగ‌స్వామికి అవ్వ‌డానికి కావాల్సిన ల‌క్షణాలు ఏంటి అని ఆమెను ప్ర‌శ్నించాడు. దీనికి మంధాన త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చింది. రెండు రూల్స్‌ను అత‌ను పాటించాల‌ని జ‌వాబు చెప్పింది. మొద‌టి ష‌రతు ఏంటంటే.. "త‌న‌ను ఎప్పుడు ప్రేమించాల‌ని", రెండ‌వ ష‌ర‌తు ఏంటంటే.. "తొలి ష‌ర‌తును ఎప్ప‌టికి పాటించ‌డ‌మే" అని చెప్పింది. ఈ సమాధానానికి ఒక వ్యంగ్య పూర్వకమైన ఎమోజీని మంధాన‌ జోడించింది.

మ‌రో అభిమాని.. మీరెంతో అదంగా ఉంటారు క‌దా.. మ‌రి సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తారా..? అని అడిగాడు. "నేను న‌టిస్తే ఆ సినిమా చూసేందుకు ఎవ్వ‌రూ థియేట‌ర్ల‌కు రారు. మీరు నా నుంచి అలాంటివి ఆశించ‌కండి" అని మంధాన స‌మాధానమిచ్చింది. మీకు ఇష్ట‌మైన అబ్బాయి ఎవ‌ర‌ని ఓ అభిమాని అడ‌గ‌గా.. చిన్న‌ప్ప‌ట్నుంచి హృతిక్ రోష‌న్ అంటే త‌న‌కు పిచ్చ‌ని స్మృతి తెలిపింది. మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా..? లేక పెద్ద‌లు కుదిర్చిన వివాహం చేసుకుంటారా..? అని అడిగితే.. ప్రేమించి పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడ‌తాన‌ని చెప్పింది. టీమ్ఇండియా త‌రుపున అరంగ్రేటం చేసిన క్ష‌ణం త‌న‌కు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పిన మంధాన‌.. ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌టం త‌న క‌ల అని, ఎప్ప‌టికైనా క‌ప్పు అందుకుంటాన‌ని చెప్పింది.

ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో స్మృతి పాల్గొంది. ఈ టోర్నీలో అంచనాలను అందుకోవటంలో ఆమె విఫ‌ల‌మైంది. ఇటీవలే ముంబై నుంచి తన సొంత ఊరు సాంగ్లీకి తిరిగి వచ్చిన మంధాన‌.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉంది.

Next Story
Share it