దాన్ని ఫేమ‌స్ చేసింది ధోనినే : కోహ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2020 8:59 AM GMT
దాన్ని ఫేమ‌స్ చేసింది ధోనినే : కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ ముద్దుగా 'చికు' అంటార‌న్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు రంజీట్రోఫీ ఆడే స‌మ‌యంలో ఆ పేరు వ‌చ్చింద‌ని తెలిపాడు. అయితే ఆ పేరు అంత‌లా ఫేమ‌స్ అవ‌డానికి కార‌ణం టిమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని కార‌ణ‌మ‌ని విరాట్ వెల్లడించాడు.

గురువారం రాత్రి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో కోహ్లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా.. తన ముద్దు పేరు ఎలా ఫేమస్‌ అయిందో కోహ్లీ చెప్పాడు.

'రంజీట్రోఫీ ఆడే రోజుల్లో అక్కడి కోచ్‌ నాకు చికు అనే ముద్దుపేరు పెట్టారు. అప్పట్లో నాకు పెద్ద బుగ్గలు ఉండేవి. 2007లో జుట్టు ఊడిపోతుంటే చిన్నగా హెయిర్‌కట్‌ చేయించుకున్నా. దాంతో నా బుగ్గలు, చెవులు పెద్దగా కనిపించేవి. కార్టూన్‌లోని ఓ కుందేలు పాత్ర పేరు చంపక్‌. దాంతో నాకు ఆ పేరు వచ్చింది' అని కోహ్లీ తెలిపాడు.

అయితే 'చికు' అనే పేరును మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఫేమస్‌ చేశాడని విరాట్ చెప్పాడు. వికెట్ల వెనుక నుంచి మ‌హీ త‌రచూ న‌న్ను చికు, చికు అని పిలువ‌డం.. అది స్టంప్స్ మైక్‌లో రికార్డ్ అవ‌డంతో అంద‌రికీ తెలిసిపోయింది' అని కోహ్లీ తెలిపాడు.

క‌రోనా ముప్పుతో ప్ర‌స్తుతం క్రీడాకారులంతా ఇంటికే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో విరాట్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. త‌రుచూ లైవ్‌లోకి వ‌స్తూ అభిమానుల‌తో సంద‌డి చేస్తున్నాడు.

Next Story
Share it