పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు
By సుభాష్ Published on 2 Oct 2020 3:59 PM ISTస్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే త్వరలో యాపిల్, శాంసంగ్, షియోమి, ఒప్పో బ్రాండెడ్ ఫోన్ల ధరలు త్వరలో భారం కానున్నాయి. స్మార్ట్ ఫోన్ల తయారీలో ఉపయోగించే డిస్‌ప్లే, టచ్ ప్యానెళ్లపై ప్రభుత్వం పది శాతం వరకు దిగుమతి సంకాన్ని విధించడంతో తయారీదారులు ఈ భారాన్ని వినియోగదారులపై వేయనుంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా వస్తువులపై దిగుమతి సుంకాన్ని విధించనుంది.
ఈ సుంకం విధించే నిర్ణయంతో డిస్‌ప్లే,టచ్‌ప్యానెళ్లపై సుంకంతో పాటు అదనపు సెస్‌ను కలుపుకొంటే దిగుమతిదారులపై 11 శాతం భారం పడనుంది. దిగుమతి సుంకాల కారణంగా మొబైళ్ల ధరలు 2 నుంచి 5 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని బిజినెస్ వర్గలు చెబుతున్నాయి. ఈ పండగ సీజన్‌లో డిమాండ్‌ను దెబ్బ తీసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్పాదక కేంద్రంగా ఎదగడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, తన ఉత్పత్తి లింక్ ప్రోత్సాహక పథకం దేశంలో దుకాణాలను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ ఫోన్ల తయారీదారులను ఆకర్షిస్తోంది. స్మార్ట్ ఫోన్ ధరలను పెరిగితే సామాన్యుడికి మరింత భారం పడనుంది.