వాగులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి

By సుభాష్  Published on  28 Oct 2020 1:10 PM GMT
వాగులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేలేరుపాడు మండలంలో ఈత కొట్టేందుకు వాగులో దిగిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. భూదేవిపేట గ్రామానికి చెందిన పలువురు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్లిన గంట్టుపర్తి మనోజ్‌ (15), శ్రీరాములు శివాజీ (16), వెంకటి (16), కర్నాటి రంజిత్‌ (16), కొనవరపు రాధాకృష్ణ (16), చల్లా భువన్‌ (17)లు గల్లంతయ్యారు.

సమాచారం తెలుసుకున్న స్థానికులు ఎస్సై టి. సుధీర్ తన పోలీసు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనా ఆరుగురి విద్యార్థుల మృతదేహాలు బయటకు తీశారు. ఒకే సారి ఆరుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story
Share it