దుర్గామాత నిమజ్జనంలో అపశృతి: రెండు పడవలు మునిగి ఐదుగురు మృతి
By సుభాష్ Published on 27 Oct 2020 4:03 AM GMT
పశ్చిమబెంగాల్‌లో విషాదం చోటు చేసుకుంది. ముర్షీదాబాద్‌లోని డుమ్మీ చెరువులో సోమవారం సాయంత్రం దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్తుండగా రెండు పడవలు మునిగి ఐదుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం పది మంది ఉన్నారు. వీరంతా బెల్డంగా ప్రాంతానికి చెందినవారని స్థానిక పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న విపత్తు నిర్వహణ బృందం, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Next Story