ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. గంజాం జిల్లాలో బొలంత్ర పరిధిలోని మంద్‌రాజ్‌పూర్‌ దారిలో బస్సుకు విద్యుత్‌ తీగలు తగిలి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 40 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సుపై 11కెవి విద్యుత్‌ లైన్‌ తీగలు తెగిపడి భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.