• భక్తులు భజన చేసే సమయంలో పేలుడు

పంజాబ్‌లో భారీ పేలుడు సంభవించింది. తాన్‌ తరన్‌ జిల్లాలో భజనలు చేస్తున్నసమయంలో బాణాసంచా పేలుడు పేలి 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు బాణాసంచా పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తాన్‌న తరన్‌ జిల్లాలోని పాహు గ్రామంలో భక్తులు భజన కార్యక్రమం నిర్వహిస్తుండగా, 14 నుంచి 15 బాణాసంచాలు పేలాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చనిపోయిన వారంతా 18 నుంచి 20 సంవత్సరాల్లోపు ఉన్నవారే ఉన్నారని తెలుస్తోంది. భజన కార్యక్రమం కోసం ట్రాక్టర్‌ ట్రాలీలో బాణాసంచాలు తీసుకువచ్చారని, ఆ సమయంలోనే పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ పేలుడు ధాటికి ఓ ట్రాక్టర్‌ ట్రాలీ పూర్తిగా దెబ్బతింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సుభాష్

.

Next Story