మాజీ ఎంపీ శివప్రసాద్‌కు చంద్రబాబు పరామర్శ

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 20 Sept 2019 7:03 PM IST

మాజీ ఎంపీ శివప్రసాద్‌కు చంద్రబాబు పరామర్శ

చెన్నై : అపోలో ఆస్పత్రిలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాజీ ఎంపీ శివప్రసాద్‌ను.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శివప్రసాద్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక ..కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ కూడా శివప్రసాద్‌ను పరామర్శించారు. శివప్రసాద్‌కు అత్యవసర చికిత్స కొనసాగుతుందని చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ..విషమంగానే ఉందని చింతమోహన్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక..శివప్రసాద్ కన్నుమూశారనే వదంతులకు పుల్‌ స్టాప్‌ పెడుతూ ఆయన మనమడు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. తన తాత శివప్రసాద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియోలో ఆయన మనమడు పేర్కొన్నాడు.

Next Story