ప్రముఖ గాయకుడు జేసుదాసు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. జేసుదాసు సోదరుడు జస్టిన్‌ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కొచ్చిన్‌లోని బ్యాక్‌ వాటర్స్‌ సమీపంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కొచ్చిన్‌ వల్లపాడమ్‌ కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద ఆయన మృతదేహం తేలుతూ కనిపించింది. బుధవారం ఉదయం చర్చికి వెళ్లి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు.

దీంతో కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాక్‌ వాటర్స్‌ వద్ద ఆయన శవం కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మృతి చెంది ఉండవచ్చని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. కాగా, జస్టిన్‌ సంగీతకారుడు, రచయిత. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.