లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితి విషమం..

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 12 Nov 2019 2:16 PM IST

లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితి విషమం..

ముంబై: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ (90) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమెకు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. లతా మంగేష్కర్‌ న్యూమెనియాతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగవుతుందని వైద్యులు తెలిపారు. కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. 2001లో అప్పటి ప్రభుత్వం లతా మంగేష్కర్‌ను భారతదేశపు అత్యున్నత అవార్డు భారతరత్నతో సత్కరించింది.

Next Story