గాయకుడు కారుణ్య ఇంట విషాదం
By సుభాష్ Published on 30 Aug 2020 10:47 AM ISTప్రముఖ గాయకుడు, ఇండియణ్ ఐడల్ రన్నరప్ కారుణ్య సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో ఎన్నో పాటలు పాడి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తాజాగా కారుణ్య ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి జానకి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని ఆలాపూర్ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్‌లో నివాసముంటున్న కారుణ్య తల్లి గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది.
కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. కాగా, జానకి కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. సైదాబాద్ శ్మశాన వాటికలో అమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కారుణ్య తల్లి మరణించిన విషయం తెలుసుకున్న సినీ రంగ ప్రముఖులు పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story