ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన సింధు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2019 8:34 AM GMT
ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ ను కలిసిన సింధు

అమరావతి: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ పీవీ.సింధు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తర్వాత ఆమె తొలిసారిగా ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు సింధు విజయవాడ వచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సమయంలో జగన్ స్వర్ణపతకం సాధించిన సింధును అభినందించారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చూపించిన అభిమానానికి.. ప్రోత్సాహానికి సింధు సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా బ్యాడ్మింటన్

పోత్సాహానికి తాను సహకారం అందిస్తానని సిందు హామీ ఇచ్చారు. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని సింధు చెప్పుకొచ్చారు. సింధు మరిన్ని విజయాలు సాధించటానికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఢిల్లీ నుండి విజయవాడ చేరుకున్న సింధుకు మంత్రి అవంతి శ్రీనివాస్.. కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్వాగతం పలికారు.

వైజాగ్‌లో బ్యాడ్మింటన్‌ అకాడమికి ఐదు ఎకరాలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పద్మభూషణ్ అవార్డుకు తన పేరు సిపార్స్ చేయడం పట్ల సింధు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రాధికార క్రీడా సంస్థ ఆధ్వరంలో విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో ఈ రోజు మధ్యాహ్నం పీవీ సింధు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. ఆ సభలో ముఖ్యమంత్రి జగన్ మరిన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

Next Story