సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మంచిర్యాల జిల్లా తాండూరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఒకరు తాండూరు సర్పంచ్‌ అంజిబాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మృతులు మంచిర్యాల నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, రోడ్డు ప్రమాదాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. అజాగ్రత్త, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *