ఆ గుట్టపై ఆదిమానవుల భారీ సమాధి.!

By అంజి  Published on  8 March 2020 7:02 AM GMT
ఆ గుట్టపై ఆదిమానవుల భారీ సమాధి.!

ఆదిమానవుల జీవన గమనం, వారి ఆచార పద్దతలు వంటి అంశాలను మన పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. దీనికితోడు ఆదిమానవుల చరిత్రపై అనేక మంది ఔత్సాహికులు పరిశోదనలు చేసి కొత్త విషయాలు వెలుగులోకి తెస్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ ఆనవాళ్లు గుర్తించి వెలుగులోకి తెచ్చారు.

తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆదిమానవుల సమాధిని గుర్తించారు. జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీనివాసపురం పరిధిలో సిద్దెంకి గుట్టపై ఈ సమాది ఉందట. ఈ విషయాన్ని ఔత్సాహిక పురావస్తు చరిత్ర పరిశోకుడు రత్నాకర్రెడ్డి అనే వ్యక్తి వెల్లడించారు. గతంలో ఆదిమానవులకు సంబంధించి సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నాలుగేళ్ల క్రితం వెలుగుచూసిన కప్పబండ సమాధిని ప్రపంచంలోనే పొడవైనదిగా పురావస్తు శాఖ ధ్రువీకరించింది. అయితే దాని కంటే ఇది ఇంకా పొడవైందని చెబుతున్నారు.

కొలతల ప్రకారం చూస్తే నర్మెట్టలో పురావస్తు శాఖ అధికారులు గుర్తించిన దానికంటే ఇదే పొడవైందని రత్నాకర్రెడ్డి అనే ఔత్సాహికుడు పేర్కొన్నాడు. సిద్దెంకిగుట్టపై ఉన్న సమాధి 6.7 మీటర్ల పొడవు, 4.40 మీటర్ల వెడల్పు, చుట్ట కొలత 20.76 మీటర్లని తెలిపారు. బరువు 50టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ గుట్టపై రాకాసిగూళ్లు, నిలువురాయి ఉన్నాయి. ఆదిమానవులు నివసించినవిగా భావిస్తున్న గుహాలు, గుట్ట ఉపరితలంపై 3,4 అంగుళాల పొడవైన రాతి గీతల వరుసలు, రాతి పనిముట్టు నూరుకున్న గుర్తులు కనిపిస్తాయి. గుట్ట సమీపంలో రాతి గొడ్డలిసైతం బయటపడింది.

Next Story