విప‌రీతంగా విస్కీ తాగాను.. అనారోగ్యం పాల‌య్యాను!

క‌మ‌ల్‌హాస‌న్ కూతురు, హీరోయిన్ శృతిహసన్ త‌న గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు. ఓ ఇంట‌ర్యూలో ఆమె తన వ్యక్తిగత విషయాలను తెలిపింది. తాను తాగుడుకు బానిస అయ్యాన‌ని.. అందుకే కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాన‌ని వివ‌రించింది.

రెండేళ్లు పాటు విపరీతంగా విస్కీ తాగానని.. దీని వల్ల తీవ్ర అనారోగ్యం పాల‌య్యాన‌ని తెలిపింది. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని.. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నానని వెల్ల‌డించింది. ప్రస్తుతం సినిమాల మీదే తాను దృష్టి పెట్టినట్టు తెలిపింది.

తన బాయ్‌ ఫ్రెండ్ మైఖేల్‌తో బంధం ఒక మంచి అనుభవం అని శృతి తెలిపింది. ఇద్దరం చర్చించుకున్న తర్వాతనే విడిపోయామని వివ‌రించింది. ప్ర‌స్తుతం తాను ఇప్పుడు ఒక గొప్ప ప్రేమికుడి కోసం ఎదురుచూస్తున్నాన‌ని.. అలాంటి ప్రేమికుడు ఎదురైతే ఆ విషయం అందరికీ చెబుతానని తెలిపింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.