క్వారంటైన్‌లో శ్రియ అందాలు.. చూస్తే తట్టుకోలేరు
By తోట వంశీ కుమార్ Published on 29 April 2020 4:13 PM GMTటాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రియ. అగ్ర హీరోలందరితోనూ నటించింది అమ్మడు. కెరీర్ పీక్ స్టేక్‌లో ఉన్న దశలో స్పెయిన్ కి చెందిన ఆండ్రూ కొచీవ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైనప్పటికి అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తుంది అమ్మడు. ఇక స్పెయిన్ లో కరోనా విజృంభిస్తోంది. దీంతో అక్కడ లాక్‌డౌన్‌ను విధించారు. ప్రస్తుతం శ్రియా హోం క్వారంటైన్‌లో ఉంది. ఖాళీగా ఉండడం ఎందుకని.. తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులకు కనువిందు చేసింది శ్రియ.
తాజాగా శ్రీయ ఇంటి బాల్కనీలో నుంచుని ఇచ్చిన ఫోజు వేడెక్కించేస్తోంది. వెండి సాటిన్ నైట్ టాప్ లో తళుక్కున మెరిసిన శ్రీయ అందాల్ని ఆ బ్లాక్ ఇన్నర్ రెట్టింపు చేసింది. కుర్రకారుకు మత్తెక్కించే విజువల్ ట్రీట్ ని ఇస్తోంది ఈ లుక్. ఓవైపు భర్తకు కొవిడ్ 19 సోకిందేమోనన్న బెంగతో ఉన్న శ్రీయ.. మరోవైపు రొమాన్స్ విషయంలో ఏమాత్రం తగ్గకపోవడంపై యూత్ ఒకటే గుసగుసలాడేస్తున్నారు.