ఆమె పై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయండి ప్లీజ్..

By రాణి  Published on  17 April 2020 9:32 PM IST
ఆమె పై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయండి ప్లీజ్..

ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన అందాల తార శ్రియ. ఇప్పటికీ చెక్కు చెదరని అందం ఆమె సొంతం. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలను పట్టించుకోని శ్రియ అభిమానులకు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో తన డ్యాన్స్ తో వినోదాన్ని పంచుతుంటారు. ఇటీవలే తన భర్త ఆండ్రితో కలిసి ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ వీడియోలో మాట్లాడారు. అలా నెటిజన్లతో మాట్లాడుతుండగా ఓ నెటిజన్ శ్రియ శరీరం గురించి కాస్త ఘాటైన్ కామెంట్ చేశాడు.

చూసే వారికి అది చాలా తేలికే..కానీ చేసే వారికే చాలాకష్టమంటున్న ఉపాసన

దానిని శ్రియ పట్టించుకోనప్పటికీ భర్త ఆండ్రి..అతనికి రిప్లై ఇచ్చారు. మీరు చెప్పింది నిజమే. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. ఆమెపై ఇంకా ఎక్కువ కామెంట్లు చేయండి ప్లీజ్..అంటూ ఫన్నీగా మాట్లాడారు. అది విన్న శ్రియ నవ్వుతూ భర్తను కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

2018లో రష్యా క్రీడాకారుడైన ఆండ్రీని పెళ్లాడిన శ్రియ 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో తెరపై కనిపించారు. ఇప్పటి వరకూ మళ్లీ తెలుగు సినిమా వైపే చూడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కనున్న తడ్కా సినిమాలో శ్రియా ప్రధాన భూమిక పోషించనున్నారు.

Next Story