షాకింగ్ న్యూస్‌ - రివ్యూ రైట‌ర్స్ పై మండిప‌డ్డ ఆలీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 7:39 AM GMT
షాకింగ్ న్యూస్‌ - రివ్యూ రైట‌ర్స్ పై మండిప‌డ్డ ఆలీ

ఓంకార్ తెర‌కెక్కించిన తాజా చిత్రం 'రాజు గారి గ‌ది- 3'. ఈ సినిమా ఇటీవ‌ల రిలీజైంది. అయితే... ఈ చిత్రానికి రేటింగ్ ఓంకార్ టీమ్ ఆశించిన స్ధాయిలో రాలేదు. అందుక‌ని స‌క్స‌స్ మీట్‌లో ఓంకార్ త‌రుపున ఆలీ మాట్లాడుతూ... రివ్యూ రైట‌ర్స్ పై షాకింగ్ కామెంట్ చేసారు. ఇంత‌కీ.. ఆలీ ఏమ‌న్నారో ఆయ‌న మాటల్లోనే...నేను థియేట‌ర్ కి వెళ్లి చాలా రోజులు అయ్యింది. అయితే.. మా ఫ్యామిలీ ఈ సినిమాని కూక‌ట్ ప‌ల్లిలో భ్ర‌మ‌రాంభ ధియేట‌ర్‌కి వెళ్లి చూడ‌డం జ‌రిగింది. సినిమా చూస్తే.. అక్క‌డే చూడాలి అనిపించింది. ప్రేక్ష‌కుల్లో క‌ల్మ‌షం ఉండ‌దు. మ‌న‌స్పూర్తిగా న‌వ్వుకుంటారు. చాలా బాగా చేసార‌ని మ‌మ్మ‌ల్ని అభినందిస్తుంటారు. ప్రివ్యూ షో చూస్తుంటే... మ‌న సొమ్ము ఎవ‌డో అవ‌త‌లివాడు లాగేసుకుంటున్నాడేమో అనుకుంటారో ఏమో.. న‌వ్వరు. న‌వ్వాల‌ని లోప‌ల అనుకున్నా కూడా పైకి న‌వ్వుతున్న‌ట్టు ఉంటారు మ‌న‌స్పూర్తిగా న‌వ్వుకోరు. అందుక‌ని ఇక ప్రివ్యూ షోలు చూడ‌డం మానేస్తాను. ఏ హీరో సినిమా అయినా స‌రే... ఓన్లీ థియేట‌ర్ కి వెళ్లి చూస్తాను.

పెద్ద హీరో, చిన్న హీరో అని తేడా ఉండ‌దు ఇండ‌స్ట్రీకి. క‌ళామ‌త‌ల్లి చిన్న హీరోని బిడ్డ‌లాగే చూసుకుంట‌ది.. పెద్ద హీరోని కూడా బిడ్డ లాగే చూసుకుంట‌ది. కొంత మంది ప‌నిగ‌ట్టుకుని సినిమా బాగోలేదు.. పెద్ద‌గా లేదు. ఏదో అనుకున్నాం ఏదో ఎక్స్ పెక్ట్ చేసాం. అస‌లు మీరు ఎవ‌రు..? చెప్పాల్సింది ప్రేక్ష‌కులు.. వాళ్ల‌ని న‌మ్ముకుని మేం బ‌తుకుతున్నాం. ఎవ‌రైతే కామెంట్ చేస్తున్నారో.. వాళ్ల‌ని న‌మ్ముకుని మేం ఇండ‌స్ట్రీకి రాలేదు. ఏంటంటే.. అలా ఒక రాయి వేసేస్తే మ‌నం తోపులం అనుకుంటారు కానీ.. మీ అంత మూర్ఖులు ఎవ‌రూ ఉండ‌ర‌ని నేను అంటాను. ఆ విష‌యంలో రాజు గారి గ‌ది- 3 స‌మాధానం చెప్పింది అంటూ రివ్యూ రైట‌ర్స్ పై ఆలీ షాకింగ్ కామెంట్స్ చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

Next Story
Share it