వాట్సాప్ గురించి షాకింగ్ అలర్ట్.. పక్కా తెలుసుకోండి..!
By న్యూస్‌మీటర్ తెలుగు
వాట్సాప్ మెస్సేజింగ్ యాప్.. ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. చాటింగ్‌తో పాటు వీడియో, ఆడియో కాల్స్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఈ యాప్ మరింత చేరువైంది. రోజు రోజుకు దీనిని వాడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు కొందరు ఈ యాప్‌ను అనవసర పనులను ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారు. వాట్సాప్ దుర్వినియోగంపై నమోదు అవుతున్న కేసులపై వాట్సాప్ దిద్దుబాటు చర్యలకు పునుకుంది. వాట్సాప్ గ్రూప్ పేరు కానీ, ఐకాన్ గాని చట్ట విరుద్ధంగా ఉన్నట్లయితే ఎటువంటి సమాచారం అందించకుండా ఆ గ్రూప్‌ను నిషేధించనుంది. ఈ మేరకు అమెరికాకు చెందిన వెబ్‌సైట్ రెడిట్‌లో మోవ్ అనే వ్యక్తి దీని గురించి రాసుకొచ్చారు.
ఆయన మెంబర్‌గా ఉన్న వాట్సాప్ గ్రూప్ పేరును పిల్లల లైంగిక వేధింపుల అర్థం వచ్చేలా మరో మెంబర్ మార్చాడు. దీంతో వాట్సాప్ యాజమాన్యం.. ఆ గ్రూప్‌లోని సభ్యులందరినీ సస్పెండ్ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి అసభ్యకర, అవాస్తవాలను మార్పిడి చేసినట్లయితే వారిపై వాట్సాప్ చర్యలు తీసుకొంటోంది. దుర్వినియోగం చేస్తున్న వారి వాట్సాప్ అకౌంట్‌లను నిషేధిస్తోంది. అయితే నిషేధ ప్రక్రియ ఆటోమేటెడ్ ప్రాసెస్‌గా పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేటాడేటా, గ్రూప్ ఐకాన్, పేరు ఆధారంగా వాటిని ఆటోమేటిగ్గా వాట్సాప్ సర్వర్ తొలగిస్తోందని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.