ముంబై: మహారాష్ట్రలో బీజేపీ , శివసేన ప్రభుత్వం ఏర్పడటం దాదాపు ఖాయమైంది. అయితే..ఈసారి సీఎం పీఠం తమకే కావాలంటోంది శివసేన. కుదరని పక్షంలో 50 -50 ఫార్మూలాకు బీజేపీ జై కొట్టాలని డిమాండ్ చేస్తుంది. ఎన్నికలకు ముందే అమిత్ షాతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఉద్దవ్ థాకరే చెప్పారు. అయితే..ముందు ఎవరూ సీఎం కావాలి అనేది తేలాల్సి ఉంది. శివసేన డిమాండ్ ను బీజేపీ అంగీకరిస్తుందో లేదో చూడాలి. అయితే..ఫలితాలు అనంతరం ప్రధాని మోదీ ఢిల్లీలో మాట్లాడుతూ…మళ్లీ ఫడ్నీవీసే సీఎం పగ్గాలు చేపడుతారని ప్రకటించారు. ఇప్పటివరకు దీనిపై శివసేన స్పందించలేదు.

ఇక మరోవైపు…ముంబైలోని వర్లీ నియోజకవర్గం నుంచి ఆదిత్య థాకరే బంఫర్ మెజార్టీతో విజయం సాధించాడు. ఎన్సీపీ అభ్యర్ధి సురేష్ మానేపై 70వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి నుంచి కూడా ఆదిత్య థాకరే పోటీపై జాతీయ, ప్రాంతీయ ఛానళ్లు ప్రత్యేక దృష్టి పెట్టాయి. థాకరే కుటుంబం నుంచి ఆదిత్య థాకరేనే మొదట ఎన్నికల్లో నుంచున్నారు . అందుకే…ఈ ఆదిత్య పోటీకి ఆంత క్రేజ్ ఏర్పడింది. 1966లో శివసేనను స్థాపించిన తరువాత..ఆదిత్య ఒక్కరే ఆ కుటుంబం నుంచి ఎన్నికల గోదాలోకి దూకారు.మొదటి నుంచి కూడా ఆదిత్య సోషల్ మీడియాలో మంచి యాక్టివ్‌గా ఉంటారు. శివసేనలో మాస్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. 50-50 ఫార్మూలాలో భాగంగా శివసేనకు సీఎం పీఠం దక్కితే..ఆదిత్యనే ముఖ్యమంత్రి అవుతారనడంలో సందేహం లేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.