షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం..
By Newsmeter.NetworkPublished on : 21 Feb 2020 7:11 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి షిర్డీ వెలుతున్న షీర్డీ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్ కొద్ది దూరం వెళ్లిపోయింది. దీంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటన విజయవాడ సింగ్‌నగర్ వద్ద చోటు చేసుకుంది. ఇంజిన్ నుంచి బోగీలు విడిపోవడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన అక్కడకు చేరుకున్న అధికారులు మరమ్మతులు చేపట్టారు. అనంతరం రైలు బయల్దేరింది. ఈ ఘటనలో ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు. కాగా.. సాంకేతిక సమస్య కారణంగా ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయని రైల్వే అధికారులు తెలిపారు.
Next Story