శిల్పాశెట్టి.. 26 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Nov 2019 12:39 PM GMT
శిల్పాశెట్టి.. 26 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ..!

అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుని... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. అబ్బాస్-ముస్తాన్ బాజిగార్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. నేటికి శిల్పాశెట్టి ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించి 26 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా శిల్పా శెట్టి స్పందిస్తూ... చిత్ర‌ పరిశ్రమలోకి తన ప్రవేశం అనేది అనుకోకుండా వ‌చ్చిన అదృష్టం అని పేర్కొన్నారు.

Shilpashetty

15 సంవత్సరాల వయస్సులో, ఒక ఫోటోగ్రాఫర్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న‌ ఆమె ఫోటోలను ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చూపించ‌డం... ఆ ఫోటోలు చూసి అవ‌కాశం ఇవ్వ‌డం జ‌రిగిందన్నారు. థ్రిల్లర్ మూవీతో అరంగేట్రం చేసినందుకు విమర్శకులు ప్రశంసలతో సినీ పరిశ్రమలోకి స్వాగతం పలికారు. ఇక అక్క‌డ నుంచి ఆమె వెన‌క్కి తిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు.

Shilpashetty1

మెయిన్ ఖిలాడి తు అనారి, ధడ్కాన్, రిష్టే, ఫిర్ మిలెంగే, లైఫ్ ఇన్ ఎ… మెట్రో ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో న‌టించారు. 26 అద్భుతమైన సంవత్సరాలు పూర్తయిన సంద‌ర్భంగా శిల్పా మాట్లాడుతూ..ఇది అద్భుతమైన ప్రయాణం. ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రేమకు నేను కృతజ్ఞురిలిని. నేను అదృష్టవంతురాలిని. 26 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో సెలబ్రిటీ బిగ్ బ్రదర్ 5 ను గెలుచుకోవడం, టెలివిజన్ కోసం డ్యాన్స్ షోలకు జ‌డ్జీగా ఉండ‌డం, యోగా యొక్క పురాతన క్రమశిక్షణను పునరుద్ధరించడం చాలా సంతోషంగా ఉంది అంటూ శిల్పా శెట్టి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు.

Next Story