బుట్ట బొమ్మ పాటకు డ్యాన్‌ చేసిన సాగరకన్య.. వీడియో వైరల్‌..

By అంజి  Published on  9 Feb 2020 8:22 AM GMT
బుట్ట బొమ్మ పాటకు డ్యాన్‌ చేసిన సాగరకన్య.. వీడియో వైరల్‌..

అల్లు అర్జున్‌-పూజ హెగ్దే హీరో, హీరోయిన్లుగా నటించిన 'అల వైకుంఠపురం' సినిమా బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించింది. సినిమాలోని పాటలు జనాలను ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తున్నాయి. 'అల వైకుంఠపురం' సినిమా బాక్సాఫీస్‌ వద్ద నాన్‌బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాలో టబు, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, జయరామ్‌, మురళీశర్మలు నటించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. దర్శకుడు త్రివిక్రమ్‌ తెరక్కెక్కించిన ఈ సినిమాలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ పని చేశారు. థమన్‌ ఈ సినిమాలో ట్యూన్‌ చేసిన అన్ని సాంగ్‌లు సినిమా రిలీజ్‌కు ముందే హిట్టయ్యాయి. సినిమాలో కామెడీ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని సాంగ్స్‌ టిక్‌టాక్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌, ఈవెంట్స్‌లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అలవైకుంఠపురం సినిమా సాంగ్స్‌ను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు వింటూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. రాములో రాములా, బుట్ట బొమ్మ. సాంగ్‌లు యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టించాయి. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి.., తన సోదరి షమితా శెట్టిలతో బుట్ట బొమ్మ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి ఇన్‌స్టాలో నెటిజన్లను అలరించారు. ఆమె బుట్ట బొమ్మ సాంగ్‌కు వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. శిల్పాశెట్టి గతంలో తెలుగు సినిమాలు కూడా చేసింది. సాగరవీరుడు, భలేవాడిని బాసు సినిమాల్లో శిల్పా నటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం 'అల వైకుంఠపురలో' సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌కు ప్లాన్‌ చేస్తున్నారు.

Next Story
Share it