గ‌బ్బ‌ర్ కు గాయం..

By Newsmeter.Network  Published on  19 Jan 2020 2:39 PM GMT
గ‌బ్బ‌ర్ కు గాయం..

చిన్న‌స్వామి వేదిక‌గా ఆస్ట్రేలియాతో ఆదివారం ఇక్క‌డ జ‌రుగుతున్న నిర్ణ‌యాత్మ‌క మూడో వ‌న్డేలో శిఖ‌ర్ ధావ‌న్ గాయ‌ప‌డ్డాడు. ఫించ్ కొట్టిన బంతిని ఆపే క్ర‌మంలో శిఖ‌ర్ గాయ‌ప‌డ్డాడు. మైదానాన్ని వీడిన శిఖ‌ర్ మ‌ళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్ట‌లేదు.

అస‌లేం జ‌రిగిందంటే..

టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ ఐద‌వ ఓవ‌ర్ లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ క‌వ‌ర్స్ లో కొట్టిన బంతిని శిఖ‌ర్ ధావ‌న్ డైవ్ చేసి ఆపాడు. ఈ క్ర‌మంలో శిఖ‌ర్ ఎడ‌మ భుజానికి గాయ‌మైంది. ఫిజియో వ‌చ్చినా లాభం లేక‌పోయింది. దీంతో శిఖ‌ర్ బాధ‌తో మైదానాన్ని వీడాడు. గ‌బ్బ‌ర్ గాయం తీవ్ర‌త‌ను తెలుసుకునేందుకు టీమిండియా మేనేజ్ మెంట్ స్కానింగ్ నిమిత్తం ఆస్ప‌త్రికి పంపించింది. దీంతో బ్యాటింగ్ కు అత‌ను రాలేదు. ధావ‌న్ స్థానంలో రాహుల్ ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగాడు. గాయం తీవ్ర‌త తెలుసుకున్న త‌రువాత‌నే అత‌ను మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలుస్తుంద‌ని బీసీసీఐ ట్వీట్ చేసింది. అంత‌క ముందు శుక్ర‌వారం జ‌రిగిన రెండో వ‌న్డేలో శిఖ‌ర్ బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు ప్యాట్ క‌మిన్స్ బౌలింగ్ లో గాయ‌ప‌డ‌డంతో త‌రువాత ఫీల్డింగ్ రాని విష‌యం తెలిసిందే..Next Story
Share it