షార్జాలో భారీ అగ్ని ప్రమాదం.. భవనంలో భారతీయులు
By సుభాష్ Published on 6 May 2020 8:41 AM GMTషార్జాలో భారీ అగ్నిప్రమాదంలో చోటు చేసుకుంది. అల్‌నహ్‌డా ఏరియాలోని 49వ అంతస్తులో అబ్కో టవర్‌లో మంగళవారం అర్థరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. ఈ పదో అంతస్తుతో పాటు ఇతర అంతస్తులకు మంటలు భారీగా వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భవనం నుంచి స్థానికులు పరులు పెట్టారు. సమాచారం అందుకున్న షార్జా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సుమారు 4 గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ భవనంలో దాదాపు 300 మంది వరకూ నివసిస్తున్నట్లు సమాచారం.
అందులో చాలా మంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ఈ భవనంలో పార్కింగ్ మినహా 47 అంతస్తులు ఉన్నాయని గల్ఫ్ న్యూస్ నివేదించింది. భవనం యొక్క నివాసితులను, పొరుగువారిని అధికారులు ఖాళీ చేసినట్లు తెలిపింది. నివేదిక ప్రకారం, షార్జా సివిల్ డిఫెన్స్ బృందాలు ఒక పెద్ద విపత్తును నివారించాయి.
ఈ అగ్ని ప్రమాదంలో విలువైన వస్తువుల, ఇతర విలువైన పత్రాలు, నగదు కోల్పోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో భవనంలో చిక్కువారిని స్థానికుల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎవరికైన ప్రాణనష్టం జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది.