రిటైర్డ్‌ మహిళా ఎస్సైపై గ్యాంగ్‌ రేప్‌

By సుభాష్  Published on  6 May 2020 7:59 AM GMT
రిటైర్డ్‌ మహిళా ఎస్సైపై గ్యాంగ్‌ రేప్‌

దేశంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ కారణంగా కాస్త క్రైమ్‌ రేటు తగ్గిపోయినా ఇంకా అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల పంజాబ్‌లో

లాక్‌డౌన్ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నవారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీస్‌ అధికారి చేయి నరికేసిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఓ రిటైర్డ్‌ మహిళా ఎస్సైని కొందరు దుండగులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. లాక్‌డౌన్‌తో షెల్టర్‌ హోంలో చిక్కుకుపోయిన రిటైర్డ్‌ ఎస్సైపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన రిటైర్డ్‌ మహిళా ఎస్సై (52) జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఆమె పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో చిక్కుకుపోయారు. దీంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జీఆర్పీ పోలీసుల సాయంతో షెల్టర్‌ హోంలో ఆశ్రయం కల్పింల్పించారు.

అంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అత్యారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it