ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం..

By రాణి  Published on  1 Feb 2020 4:40 AM GMT
ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం..

శంషాబాద్ ఔటర్ రింగ్ వద్ద శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వేగంగా వెళ్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని అమాంతం ఢీ కొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఫారుఖ్ నగర్ మండల్ సోల్ పేట్ కు చెందిన బాల్ రెడ్డి నర్సింహా, శంకర్ లు అక్కడికక్కడే మరణించారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా...ఔటర్ రింగ్ రోడ్డు రాళ్లగుడా ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వారాంతం వస్తే చాలు ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగే ప్రమాదాలకు లెక్కలేదు. మద్యం మత్తులో లేదా ఓవర్ స్పీడ్ లో వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లెక్క చెప్పలేం. కానీ...ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతాయని తెలిసి కూడా జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం.

Next Story
Share it