కొడుకు ప్రేమించిన అమ్మాయి.. కోడలిగా రావడం ఆ తండ్రికి ఇష్టం లేదు. అందుకు ఆ అమ్మాయిని పెళ్లి పేరుతో ఇంటికి పిలిపించి అత్యాచారం చేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఘటన తమిళనాడులో జరిగింది.

ఘటన వివరాల్లోకి వెళితే.. నాగపట్టణానికి చెందిన నిత్యానందం అనే వ్యక్తి పట్టణంలో ఓ వస్త్ర దుకాణాన్ని నడుపుతున్నాడు. అతని కొడుకు ముఖేశ్.. ఓ యువతిని(20) ప్రేమించాడు. ఈ విషయం నిత్యానందానికి తెలిసింది. ఆమెకు ఆస్తి పాస్తులు లేకపోవడంతో.. కొడుకుతో పెళ్లి చేయడం నిత్యానందానికి ఇష్టం లేదు. ఆమెను వివాహాం చేసుకోవద్దని కొడుకు కు చెబితే.. తనను ఎదురించి వివాహాం చేసుకుంటాడని భయపడ్డాడు. అందుకనే ఓ నీచమైన ఐడియా వేశాడు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తే.. కొడుకు ఆమెను వివాహం చేసుకోడనే పథకం పన్నాడు.

అందులో భాగంగా 20 రోజల క్రితం ఆ యువతికి ఫోన్‌ చేసి.. పెళ్లి విషయం మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించాడు. ఆమెను మాటల్లో దింపి తలుపులు మూసివేశాడు. అనంతరం జేబులో నుంచి తాళి తీసి ఆమె మెడలో కట్టాడు. అంతటితో ఆగకుండా గదిలో బంధించి పలు మార్లు అత్యాచారం చేశాడు. రెండు రోజుల నరకం అనంతరం ఆ యువతి ఎలాగోలా తప్పించుకుని స్నేహితురాలి ఇంటికి చేరింది. అనంతరం స్నేహితురాలితో కలిసి వేదారణ్యం పోలీస్‌ స్టేషన్‌ లో వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.