శంషాబాద్‌: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. అబుదాబి నుంచి వచ్చిన హబీబ్ అలీ అల్కాప్‌ అనే ప్రయాణికుడి నుంచి భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ స్కానింగ్ చేస్తుండగా 45వేల సౌదీ రియల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఇండియన్ కరెన్సీలో 8 లక్షల 57వేల ఉంటుందని అధికారులు చెప్పారు. హబీబ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story