మానవ అక్రమరవాణా బాధితుల కష్టాలను కళ్లముందుంచిన 'శక్తి' నృత్యరూపకం

'Shakti' is a choreography that visualizes the plight of victims of human trafficking. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో క్రమబద్ధమైన

By Medi Samrat  Published on  2 July 2022 11:30 AM GMT
మానవ అక్రమరవాణా బాధితుల కష్టాలను కళ్లముందుంచిన శక్తి నృత్యరూపకం

మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో క్రమబద్ధమైన మార్పులకు మార్గదర్శకత్వం వహించిన వ్యక్తులను ప్రజ్వల స్వచ్ఛంద సంస్ధ సత్కరించింది. తెలంగాణా రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖామాత్యులు సత్యవతి రాథోడ్‌ , ప్రజ్వల సంస్థ ఫౌండర్‌ సునీతా కృష్ణన్‌ తో పాటుగా పలువురు ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో లాస్యధృత సెంటర్‌ ఫర్‌ పెర్‌ఫార్మింగ్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సంస్థ 'శక్తి' శీర్షికన ఓ నృత్య రూపకం ప్రదర్శించింది.

మోహినీయాట్టం నృత్యకారిణి అనితా ముక్తశౌర్య ప్రత్యేకంగా ఈ నృత్య రూపకాన్ని సునీతా కృష్ణన్‌ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్‌ కోసం తీర్చిదిద్దారు. మానవ అక్రమ రవాణా బారిన పడి తప్పించుకున్న మహిళల వ్యక్తిగత అనుభవాల స్ఫూర్తితో తీర్చిదిద్దిన శక్తి నృత్య రూపకాన్ని తొలిసారిగా 2018లో దక్షిణాసియా సదస్సులో ప్రదర్శించారు.

ప్రజ్వల సత్కార కార్యక్రమంలో జరిగిన శక్తి నృత్యరూపకంలో శాస్త్రీయ నృత్య కారిణిలు అనితా ముక్తశౌర్య, శరణ్య కేదార్‌నాథ్‌, సుజి పిళ్లై, కృతి నాయర్‌,షాలికా పిళ్లైలు మోహినీయాట్టం ; దేబశ్రీ పట్నాయక్‌ ఒడిస్సీ నృత్యంను ; శ్రీదేవి, వైష్ణవి, భాగవతుల విదూషి. విభూతిలు భరతనాట్యం ; అమీ కుమార్‌, తలారి నవోనికా లు కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమాయక ప్రజలు నుంచి ఎవరూ అక్కున చేర్చుకోని వ్యక్తులుగా సమాజంలో మిగిలిపోవడం వరకూ హృదయ విదారకరమైన సంఘటనలకు ప్రతిరూపంగా నిలిచిన వ్యక్తుల జీవితాలను నృత్యకారిణి లు కళ్లముందుంచారు. ప్రతి ఒక్కరూ భయపడే వారి జీవితాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా అన్యాయం అంటే ఏమిటనేది ప్రశ్నించారు.

బాధ, అణచివేత, గాయం, అవమానం, విలువలేని వ్యక్తిగా పరిగణించడంతో పాటుగా చాలా సార్లు తమ సొంత కుటుంబం, సమాజం నుంచి బహిష్కరించబడినప్పటికీ ధీరోధాత్తంగా పోరాడే వారి అంతర్గత శక్తిని ఈ శక్తి నృత్యరూపకం కళ్లముందుంచింది.


















Next Story