ఏసీబీ అధికారుల చేతికి మరో అవినీతి చేప చిక్కింది. షేక్‌పేట ఆర్‌ఐ రవీంద్ర రూ.15లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్థల యజమాని నుంచి రూ. 50 లక్షలు ఆర్‌ఐ నాగార్జున డిమాండ్‌ చేశారు. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఆర్‌ఐ చిక్కాడు. షేక్‌పేట ఆర్‌ఐతో పాటు బంజారాహిల్స్‌ ఎస్‌ఐ డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

బంజారాహిల్స్‌లో ఒకటిన్నర ఎకరం స్థలంపై వివాదం నడుస్తోంది. సయ్యద్‌ అబ్దుల్‌కు చెందిన భూమిని రెవెన్యూ స్థలంగా ప్రభుత్వం పేర్కొంది. స్థలం తమదేనంటూ సయ్యద్‌ అబ్దుల్‌ కోర్టుకెక్కాడు. స్థలం సయ్యద్‌ అబ్దుల్‌దేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసేసి సయ్యద్‌ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయితే రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సయ్యద్‌ అబ్దుల్‌పై కేసు నమోదు చేశారు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్ఐ నాగార్జున రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.