హైద‌రాబాద్ : తెలంగాణ‌ రాష్ట్రంలో అతి పెద్ద కార్పోరేషన్ టీయస్ఆర్టీసీ అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. రోజూ కోటి మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుందని.. కార్మికులు.. సమస్యలపై అనేక సార్లు నోటీసులు ఇచ్చారని.. అయినా ప్ర‌భుత్వం స్పందించ‌లేద‌న్నారు. టీఆర్ఎస్ నాయకులు కోటీశ్వరులు అయ్యారు.. కానీ, ఉద్యమం చేసిన ఉద్యోగులు బికారీలు అయ్యారని అన్నారు.

కేసీఆర్ సీఎంగా కాకుండా.. పోలీస్ బాస్ లా వ్యవహరిస్తూ.. కార్మికులను బెదిరిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఈ ముఖ్యమంత్రి యూ టర్న్ ముఖ్యమంత్రని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ లా వ్యవహరిస్తే ఉద్యమం చేసే వాళ్ల‌మా..? అని ప్ర‌శ్నించారు.

ఆర్టీసీ కార్మికులను పిలిచి వారి సమస్యలను పరిష్కరించండని.. కార్మికులను చర్చలకు పిలిచినంత మాత్రనా సీఏం విలువ ఎం తగ్గదని హితువు ప‌లికారు. కార్మికుల ను డిస్మిస్ చేస్తా అంటే.. ప్రజలు మిమ్మల్ని డిస్మిస్ చేస్తారు గుర్తుంచుకో కేసీఆర్..! అంటూ హెచ్చ‌రించారు. ప్రజలకు ఇబ్బంది క‌లుగ‌కుండా తొందరగా సమస్య పరిష్కరించాలని అన్నారు. కాంగ్రెస్.. ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటుందని… సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తుందని అన్నారు.

నిన్న ప్రధాని మోదీని కలిసిన కేసీఆర్ వెనకబడిన జిల్లాలకు నిధులు అడిగారు. గతంలో వెనకబడిన జిల్లాలకు డబ్బులు అవసరం లేదు అన్నారు. ధనిక రాష్ట్ర‌మని చెప్పి, నీతి అయోగ్ లో మాకు డబ్బులు కావాలని అడుగుతున్నారని అన్నారు. 16 ఏప్రిల్ 2017లో మైనారిటీ, ఎస్టీ రిజర్వేషన్ పై ఏకగ్రీవ తీర్మానం చేసారని.. కానీ ఇంతవరకు ఎక్కడా అమలు కాలేదని అన్నారు. ప్రధానికి 23డిమాండ్ లు పెట్టినప్పుడు మా డిమాండ్ ఎందుకు పెట్టలేదని మైనారిటీ, ఎస్టీలు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.

హుజూర్‌న‌గ‌ర్ లో మైనారిటీ, ఎస్టీలు కాంగ్రెస్ కు ఓటు వేయాలని షబ్బీర్ పిలుపునిచ్చారు. వైయస్ హాయాంలో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చర్చకు వచ్చినా.. మేము చేయకుండా ఆర్టీసీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయనియ‌లేద‌న్నారు. కేసీఆర్‌కు ఆర్టీసీ, నిరుద్యోగులు‌, యూనివర్సిటీలు, ఆసుపత్రులంటే ఎలర్జీ అని ఎద్దేవా చేశారు.

తొక పార్టీ లు అన్న వాళ్ళే తొక పార్టీని కలుపుకున్నారని.. కేటీఆర్ ది నోరు కాదు మోరి అని విమ‌ర్శించారు. సీపీఐ డిమాండ్లన్నింటికి ఓప్పుకున్నామని కేకే అన్నారని.. ఆ డిమాండ్లేంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో అన్ని బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని… బీజేపీ, టీఆర్ఎస్ లు ఓక్కటేన‌ని ఆరోపించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.