విశాఖలో సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు చేశారు పోలీసులు. మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యభిచార నిర్వాహకులతో పాటు ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని  ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో వారిని విచారిస్తున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్లు ఉన్నట్లు సమాచారం.

మాధవధారలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో కొద్దిరోజులుగా వ్యభిచారం గుట్టుగా జరుగుతోంది. పోలీసులకు దొరికిపోయిన వారిలో దొరబాబు, పరదేశితో పాటూ మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. దొరబాబు, పరదేశి హైపర్‌ ఆది టీమ్‌లో కంటెస్టెంట్లు అన్న సంగతి తెలిసిందే. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.