సివరేజ్ క్లీనింగ్ కి 'అల్గే' బ్యాక్టీరియా - ఐఐటీ హైదరాబాద్ కొత్త ఫార్ములా
By Newsmeter.Network Published on 24 Dec 2019 6:47 AM GMTముఖ్యాంశాలు
- సివరేజ్ క్లీనింగ్ కి సరికొత్త విధానం
- ఫలించిన ఐఐటీ హైదరాబాద్ ప్రయోగాలు
- అల్గే, బ్యాక్టీరియా అధారంగా కొత్త ఫార్ములా
- వాటర్ రీసైక్లింగ్ కు అనువైన ఫార్ములా
- బయోఫ్యూయల్ తయారీకీ ఉపయుక్తం
- కొత్త ఎస్టీపీ కాస్ట్ ఎఫెక్టివ్, టైమ్ ఎఫెక్టివ్
హైదరాబాద్ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అల్గే మరియు బ్యాక్టీరియాల సాయంతో పనిచేసే హైబ్రీడ్ సివేజ్ ట్రీట్మెంట ప్లాంట్ ని తయారుచేసింది. దీనిసాయంతో మురుగు నీటినుంచి మురుగును వేరు చేసి నీటిని రీసైకిల్ చేయడం మాత్రమే కాక, బయోఫ్యూయల్ నికూడా తయారుచేసే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ విధానం సక్సెస్ అయితే గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, మాల్స్ లో ఇకపై మురుగును నియంత్రించడం చాలా సులభమవుతుంది. నిజానికి చట్టపరమైన అంశాలప్రకారం వీటన్నింటిలోనూ ఈ విధానం తప్పనిసరిగా ఉండి తీరాలి.
కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎస్టీపీల ఖరీదు చాలా ఎక్కువగా ఉండడంవల్ల దాదాపుగా వీటన్నింటిలో దేనిలోనూ ఆ విధానాన్ని అమలు చేయడంలేదు. ఐఐటీ హైదరాబాద్ రూపొదించిన తాజా ఎస్టీపీ అతి తక్కవ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇవ్వగలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ విధానంలో ఉపయోగించే మైక్రోల్గే ఎక్కువకాలం మనుగడ సాగించి కార్బన్ డై ఆక్సైడ్ ని విడుదల చేస్తుంది. దీన్ని ఉపయోగించుకుని ఏరోబిక్ బ్యాక్టీరియా మురుగు డ్రైనేజీలో ఉన్న ఆర్గానిక్ వ్యర్థాలను పూర్తిగా ఏ కణానికి ఆ కణంగా విడొగొట్టేందుకు దోహదపడుతుంది.
హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు రూపొందించిన సరికొత్త అల్గే బ్యాక్టీరియల్ హైబ్రీడ్ సివేజ్ ట్రీట్మెంట్ విధానంవల్ల మురుగు నీటినీ, వ్యర్థాలనూ, డ్రైనేజీనీ ప్రక్షాళన చేసే పద్ధతుల్లో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. దీని సాయంతో మురుగునీటినుంచి మురుగును వేరుచేసి నీటిని రీసైకిల్ చేయడంద్వారా మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కేవలం ఏరోబిక్ బ్యాక్టీరియాను మాత్రమే వినియోగించుకుని పనిచేస్తుంది. దీనివల్ల మురుగును తొలగించడానికి ఇతరత్రా రసాయనాలను వాడాల్సిన అవసరం లేదు. పైగా దీనివల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలు చాలా చాలా తక్కువ మొత్తంలో ఉంటాయని ఈ విధానాన్ని అభివృద్ధి చేసిన పరిశోథకులు చెబుతున్నారు.
అల్గే – బ్యాక్టీరియా సమర్థంగా పనిచేస్తాయి
అల్గే, బ్యాక్టీరియా రెండూ కలిస్తే వాటి పనితీరు చాలా సమర్థంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధానంలో ఉపయోగించే మేక్రోలేజ్ పోటో సింథసిస్ వల్ల ఎక్కువకాలం మనగలుగుతుంది. అది సీఓటూని విడుదల చేస్తుంది.
ఆ సీఓటూని స్వీకరించిన బ్యాక్టీరియా మురుగునీటిలోని కణాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా మురుగు వేరు చేస్తుంది. తద్వారా మురుగు తొలగిపోయిన నీటిని మళ్లీ ట్రీట్ చేసి మంచినీళ్లుగా మార్చే అవకాశం ఉటుంది. అదిమాత్రమే కాక ఈ విధానం ద్వారా బయో ఫ్యూయల్ నికూడా తయారు చేసే అవకాశం ఉంటుందని రీసెర్చ్ స్కాలర్లు చెబుతున్నారు. ఈ విధానంలో మైక్రోలేజ్ నైట్రోజన్, ఫాస్పరస్ లను కూడా వినియోగించుకుంటుంది. దానివల్ల నీటి నాణ్యత పెరుగుతుంది.
అలాగే ఈ మైక్రొలేజ్ కి మరికొన్ని రసాయన పదార్థాలను కలపడం ద్వారా బయోఫ్యూయల్ నికూడా తయారు చెయ్యొచ్చని ఈ విధానాన్ని అభివృద్ధి చేసిన పరిశోధకుల టీమ్ హెడ్ హైదరాబాద్ ఐఐటీలో ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ దేవ్ రాయ్ భట్టాచార్య చెబుతున్నారు.
ఈ పరిశోధన వివరాలు ప్రతిష్ఠాత్మకమైన జొర్నల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంజినీరింగ్ కెమిస్ట్రీ, వాటర్ ఎన్విరాన్ మెంట్ రీసెర్చ్ అండ్ ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ రీసెర్చ్ లాంటి జర్నల్స్ లో ప్రచురితమయ్యాయని హైదరాబాద్ ఐఐటీయన్లు చెబుతున్నారు. దీనికి చాలా మంచి స్పందన కూడా కనిపించిందంటున్నారు.