బీజేపీ నేతపై సంచలన ఆరోపణలు చేసిన మ‌హిళ‌

By రాణి  Published on  4 Feb 2020 1:30 PM GMT
బీజేపీ నేతపై సంచలన ఆరోపణలు చేసిన మ‌హిళ‌

- హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లై చేసిన బీజేపీ నేత

- సినిమా వాళ్లకు డ్రగ్స్ సప్లై

బీజేపీ నేత రఘునందనరావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మంగళవారం సాయంత్రం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడింది. బీజేపీ నేత రఘునందనరావు తనకు సహాయం చేస్తానని చెప్పి మోసం చేశారని వాపోయింది. ఎంసీ కేస్, 498-A కేసుల విచారణలో సహాయం చేస్తానని చెప్పి.. ఆ తర్వాత నువ్వే ఓడిపోయావ్, వెళ్లి పోలీసులుతో గడపమన్నాడని ఆరోపించింది. తన భర్త కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యే సమయంలో కిడ్నాప్ చేయించాడని, ప్రతిపక్ష పార్టీతో కలిసి తనను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించింది. న్యాయం కోసం హెచ్ఆర్సీని ఆశ్రయిస్తే వారు పోలీస్ కేసు పెట్టాల్సిందిగా సూచించారని, అందుకే కేసు పెట్టానని స‌ద‌రు మ‌హిళ‌ తెలిపింది. మహిళల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించేవారు అసలు రాజకీయ నాయకులుగా ఎలా మెలుగుతారని ఆమె ప్రశ్నించింది. రఘునందన్ రావు బాగోతం బయటపెట్టినందుకు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో తనను తిడుతూ పోస్ట్ లు పెడుతున్నారని చెప్పుకొచ్చింది.

రఘునందన్ రావుకు సంబంధించిన ప్రతి లీగల్ ఎవిడెన్స్ తన వద్ద ఉందని పేర్కొంది. రవితేజ తమ్ముడికి రఘునందన్ రావు బ్లూ ఫిలింస్ అందజేసే వాడని, ఇంకా అవి అతడి వద్దే ఉన్నాయని బాధిత మ‌హిళ‌ వివాదాస్పద ఆరోపణలు చేసింది. రఘునందన్ రావు బెదిరించడంతోనే పోలీసులు కూడా సహకరించడం లేదని ఆమె వాపోయింది. 2012లో ఆర్సీ పురం పోలీసులకు సాక్ష్యాధారాలు ఇస్తే.. వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు నా ఇద్దరు భర్తలు, రఘునందన్ రావు కలిసి తనను రాజకీయ నేతల వద్దకి పంపించే వారని తెలిపింది. తిరిగి కేసులు పెడదామంటే రఘునందన్ రావు, సీఐ రాజశేఖర్ రెడ్డి తనను అడ్డుకుని కేసులు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరించే వారని పేర్కొంది. అలాగే ఎస్ఐ అజయ్ కూడా తనను కేసులు పెట్టనివ్వకుండా పీఎస్ లో అడ్డుకున్నాడని ఆరోపించింది. అలాగే రఘునందన్ రావు సినిమా వాళ్లకు డ్రగ్స్ కూడా సప్లై చేసేవాడని, దిలీప్, నాగేందర్ రెడ్డి, శ్రీనివాసరావు, రఘునందన్ రావు తనపై 02.12.2007లో సామూహిక అత్యాచారం చేశారని ఆమె పేర్కొంది. ఎస్ నగర్ పీఎస్ పరిధిలో కూడా తనపై అత్యాచారం జరిగిందని, ఈ ఘటనలపై 2007లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది.

Next Story