హైదరాబాద్ :బోడుప్పల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అకౌంట్ సెక్షన్ లో తనిఖీలు చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఆసిఫ్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. సీనియర్ అటౌంటెండ్ రాజేందర్ రెడ్డి సూచనలు మేరకు ఆసిఫ్ లంచం డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీపీ అధికారి అచ్చేశ్వరావ్ చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు లంచం రూపంలో లక్షా 20 వేలు తీసుకున్నారని..మూడోసారి తీసుకుంటుంటే పట్టుకున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.